జూబ్లీహిల్స్ (JubileeHills) ఉపఎన్నికలో ఎమ్మెల్యే(Mla)గా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. నవీన్ యాదవ్ విజయం ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక అని చెప్పారు.
జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి (Development) పట్ల చూపుతున్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. నవీన్ యాదవ్ సేవాభావం, యువతతో అనుబంధం(Youth Relation), ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే ధోరణి, ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని కలిగించిందని మంత్రి అభినందనలు తెలిపారు. నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ఆశీర్వాదాలు, సూచనలు తనకు ప్రేరణగా నిలిచాయని అన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. ప్రజల నమ్మకానికి తగ్గట్లు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
