తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ (Telangana Global Summit) నిర్వహణ కోసం భారత్ ఫ్యూచర్ సిటీ(Bharat Futur City), గచ్చిబౌలి స్టేడియం, HICC వంటి వేదికలను డిప్యూటీ సీఎం (Deputy Cm) భట్టి విక్రమార్క అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ (Cm Revanth) నాయకత్వంలో గత రెండేళ్లలో సాధించిన విజయాలు, 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్(Telangana Rising Vision Document)ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు.
ఈ భారీ ఈవెంట్ కోసం 100 ఎకరాల ఓపెన్ స్పేస్ అవసరమవుతోందని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ, హైటెక్స్, గచ్చిబౌలి స్టేడియం, దుండిగల్ వంటి ప్రాంతాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. దుబాయ్ ఫెస్టివల్‌ను మించే స్థాయిలో ప్రపంచ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు చేరే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు. హైదరాబాద్ పెట్టుబడులకు అత్యంత అనుకూల నగరమని ప్రపంచానికి తెలియజేయనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 8, 9 రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైన రోజులు కానున్నాయని వివరించారు.
