Tuesday, February 10, 2026
Homeసాహిత్యంBooks | రెండు పుస్తకాల ఆవిష్కరణ

Books | రెండు పుస్తకాల ఆవిష్కరణ

యేచన్ చంద్రశేఖర్, కోట దామోదర్ రాసిన వ్యాస చంద్రిక-1(శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సమాహారం), అవరోధాలే అవకాశాలు (ప్రేరణాదాయకమైన నిజ సంఘటనలు) పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ(Former CBI JD VV Lakshminarayana)తోపాటు పలువురు హాజరయ్యారు.

“వ్యాస చంద్రిక-1” తెలుగు సాహిత్యం(Telugu Literature)లో, ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక (Science and Technology) రంగంలో మైలురాయి(Milestone)గా నిలుస్తుందని అన్నారు. 40 వ్యాసాల సమగ్ర సేకరణ( Comprehensive Collection Of Articles)గా విడుదలైన ఈ పుస్తకం కేవలం వ్యాస సంకలనం మాత్రమే కాదు.. విజ్ఞాన (Knowledge) పిపాసులకు ఒక విస్తృత విందు అని వక్తలు పేర్కొన్నారు.

- Advertisement -

నేటి సమాజంలో సాంకేతికత, విజ్ఞానం, పరిశోధన (Research) రంగాల్లో జరుగుతున్న అద్భుత పరిణామాలు, ఆవిష్కరణలు, వాటి వెనక భిన్నమైన, లోతైన సమాచారాన్ని చంద్రశేఖర్ అత్యంత నైపుణ్యంతో, విజ్ఞానపూర్వకంగా, సమగ్ర దృష్టితో రసవత్తరంగా అందించారని తెలిపారు. ఈ వ్యాసాలు దేశ అంతరిక్షం, రక్షణ, ఆరోగ్య రంగాల్లో సాధించిన ఆశ్చర్యకర విజయాలు, నూతన టెక్నాలజీల వినియోగం గురించి వివిధ కోణాల నుంచి వెలికితీసిన విధానం యువతను శాస్త్రీయ ఆలోచనల వైపు ఆకర్షించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

27 వ్యాసాల సంకలనంగా వచ్చిన “అవరోధాలే అవకాశాలు”.. కోట దామోదర్ పుస్తకం. ఈ వ్యాసాలు.. అవరోధాలను ఎలా అవకాశాలుగా మార్చుకున్నారన్న వ్యక్తుల నేపథ్యాల్ని రేఖామాత్రంగా ఆవిష్కరించేవే. ఏదైనా విజయం సాధించిన వ్యక్తిని కేవలం ఆ స్థాయిలో మాత్రమే చూడకుండా ఆ స్థాయికి చేరుకునేందుకు ఎదుర్కొన్న సవాళ్లు, అవాంతరాలు, అవరోధాలను తెలుసుకునే ప్రయత్నం చేసి, తమ జైత్రయాత్రకు వారు ఎంచుకున్న పంథా, రచించిన ప్రణాళికలు, అవలంభించిన క్రమశిక్షణను ప్రేరణగా తీసుకొని ముందుకు సాగినప్పుడే మనం కూడా విజయ శిఖరాలకు చేరుకుంటాం అనే అద్భుతమైన సందేశంతో సాధారణ స్థాయి నుంచి ఎవరెస్టు అంతటి శిఖరాలను తమ అకుంఠిత దీక్షతో చేరుకున్న విభిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తుల జీవిత గాధలను ఎంతో హృద్యంగా తీసుకురావడం అభినందనీయం అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News