కరీంనగర్, నవంబర్ 15 (ఆదాబ్ హైదరాబాద్ ): బోయిన్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వైద్య బృందం (Medical Team) సందర్శించి పిల్లలకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందుల(Medicines)ను అందజేశారు. తర్వాత పిల్లలకు ఓరల్ హెల్త్(Oral Health), చలికాలంలో వచ్చే అస్తమా (Asthma), ఎలర్జీకి సంబంధించిన వ్యాధుల గురించి, రక్తహీనతపై అవగాహన కల్పించారు.
అనంతరం.. స్కూల్ హాస్టల్(Hostel)ను సందర్శించి పిల్లలకు పరిశుభ్రమైన, వేడి వేడి ఆహారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని వార్డెన్(Warden)కి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ఆర్.కార్తీక్, సూపర్వైజర్స్ టి.హేమలత, అశోక్, ఇన్ఛార్జ్ ఎస్.ఓ సంగీత, సబ్ సెంటర్ ఆరోగ్య కార్యకర్త ఉషాదేవి, స్కూల్ ఆరోగ్య కార్యకర్త ప్రసన్న, ఆశా కార్యకర్త సరళ తదితరులు పాల్గొన్నారు.
