ప్రజా ప్రభుత్వం(Praja Prabhutwam)లో పేదల ఆశలు నెరవేరుతున్నాయని డిప్యూటీ సీఎం (Deputy CM) భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. మధిర (Madhira) నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇంటి (Indiramma Illu) లబ్ధిదారులైన పెనుగొండ శివకృష్ణ–నాగమణిని ఆయన వారి ఇంట్లో కలిశారు. లబ్ధిదారుల ముఖాల్లో కనిపించిన ఆనందం (Happyness) మాటల్లో చెప్పలేనిదని పేర్కొన్నారు. ఎన్నాళ్లుగానో కలగా ఉండిపోయిన సొంత ఇల్లు ఈరోజు నిజమైందని వారు భావోద్వేగంగా (Emotional) చెప్పినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Party Government) వచ్చాకే తమలాంటి పేద కుటుంబాల జీవితం మారిందని, పిల్లలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ఇల్లు దొరకడం జీవితంలో పెద్ద వరమని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఇల్లు ఆమోదం నుంచి పూర్తయ్యే వరకూ ప్రభుత్వం చూపిన శ్రద్ధ తమ కుటుంబానికి వెలుగు నింపిందని, తమకు కొత్త జీవితం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వారు గర్వంగా వెల్లడించారని భట్టి విక్రమార్క చెప్పారు.
