Wednesday, March 4, 2026
Homeకరీంనగర్Deepotsavam | కార్తీక మాసంలో భగవంతుని కృపకై దీపం వెలిగించండి

Deepotsavam | కార్తీక మాసంలో భగవంతుని కృపకై దీపం వెలిగించండి

  • కరీంనగర్‌లో నవంబర్ 14న ఘనంగా కార్తీక దీపోత్సవం
  • బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారిచే ఆధ్యాత్మిక ప్రవచనం – భక్తులకు ఆహ్వానం

పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని, కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ సామూహిక దీపారాధనలో పాల్గొనే అవకాశం కల్పించాలనే సదుద్దేశ్యంతో, నవంబర్ 14,న (శుక్రవారం) సాయంత్రం 6:00 గంటలకు, కరీంనగర్ గాంధీ రోడ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కళ్యాణ మండపం ఆవరణలో కార్తీక దీపోత్సవం భవ్యంగా నిర్వహించనున్నట్లు కార్తీక దీపోత్సవ సమితి ప్రకటించింది.
ఈ సందర్భంగా కార్తీక దీపోత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పోల్సాని సుగుణాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ “కార్తీక మాసం అత్యంత విశిష్టమైనది. దీనిని ఆధ్యాత్మిక మాసంగా పరిగణిస్తారు.

శివకేశవుల ఇరువురినీ పూజించడం ఈ మాసం ప్రత్యేకత. ఈ మాసంలో దీపం వెలిగించడం ద్వారా చెడు అనే చీకటిని పారదోలి, వెలుగు అనే జ్ఞానాన్ని, దైవకృపను పొందవచ్చు,” అని తెలిపారు.
ఈ కార్యక్రమం బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారి మార్గదర్శకత్వంలో, పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ సందర్భంగా వారు భక్తులకు ఆధ్యాత్మిక సందేశం, ప్రవచనం అందజేస్తారు. దీపారాధనకు కావలసిన ప్రమిదలు, నూనె, వత్తులు మొదలైన అన్ని సామాగ్రులు కార్తీక దీపోత్సవ సమితి ద్వారానే సమకూర్చబడతాయి. అని అన్నారు.

- Advertisement -

కరీంనగర్ పట్టణ భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, తమ చేతులతో దీపాలను వెలిగించి, అనంతరం తీర్థప్రసాదం స్వీకరించి భగవంతుని కృపకు పాత్రులు కావలసిందిగా కార్తీక దీపోత్సవం సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పోల్సాని సుగుణాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గంప జగన్ , మహిపాల్, దుర్గం మారుతి, తాడూరి బ్రహ్మం, గుడిపాటి జితేందర్ రెడ్డి, తోట రాజేందర్, కామారపు నరహరి, దేవిశెట్టి హన్మాండ్లు, విశ్వనాధం, పిట్ల స్వామి, మల్లేశం, తిరుపతి, విజయలక్ష్మి, చంద్రకళ, కాటకం చంద్రయ్య,మొలుగురి కిషోర్, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News