Wednesday, March 25, 2026
Homeవరంగల్‌Tribute | అందె శ్రీ కి అశ్రునివాళి

Tribute | అందె శ్రీ కి అశ్రునివాళి

  • నేల కూలిన తెలంగాణ సాహితీ శిఖరం.

ప్రముఖ కవి రచయిత అందెశ్రీ(Ande Sri) మృతి పట్ల తెలంగాణ జన సమితి పార్టీ(Telangana Jana Samithi Party) వరంగల్ జిల్లా కమిటీ అందె శ్రీ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్(Ambati Srinivas), వరంగల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్ మాట్లాడుతూ, ప్రత్యేక ఉద్యమంలో తన మాట పాటలతో అందెశ్రీ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. మనిషిలో మానవత్వం కరువైపోయిందన్న గొప్ప కవి అందెశ్రీ అన్నారు.

అందే శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఎన్నిక చేయడం ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలిసిపోయింది రాష్ట్రంలోని కవులను గాయకులను సాహితిలోకాన్ని వదిలి ఆకస్మికంగా అందెశ్రీ వెళ్ళిపోవడం బాధాకరం అన్నారు అందె శ్రీ కుటుంబానికి తమ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్, రాష్ట్ర నాయకులు గుంటి రామచందర్, బోనగాని రవీందర్, సోల్తి సాయికుమార్, మహమ్మద్ సందాని మొదలు వారు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News