Friday, February 27, 2026
Homeవరంగల్‌Kavitha | ఇళ్లు రాని బాధితులతో సమావేశం

Kavitha | ఇళ్లు రాని బాధితులతో సమావేశం

తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం వరంగల్ ఈస్ట్ (Warangal East) నియోజకవర్గంలోని ఎస్ఆర్ నగర్ లో డబుల్ బెడ్రూం ఇండ్లు (Double Bedroom Houses) రాని బాధితులతో సమావేశంమై వారి సమస్యలు అడిగి తెలుసుకన్నారు. ఎస్ఆర్ నగర్ లో మొత్తం వెయ్యి కుటుంబాల వరకు ఉన్నాయి. గతంలో 150 ఇళ్లు కూల్చేసి…కొత్తగా 750 ఇళ్లు నిర్మించారు. తమ స్థలం ఇచ్చి వేరే వారికి ఇళ్లు వచ్చేలా పెద్ద మనసు చేసుకున్నారు ఈ కాలనీ వాసులు. ఇంత మంది ఉంటున్నా సరే వారికి ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు.

ఈ కాలనీలో కరెంట్ (Current) సరిగా వస్తలేదు, మంచినీళ్లు (Water) కూడా ఇస్తలేరు. ఆడపిల్లలకు సెక్యూరిటీ ఇష్యూ (Security Issue) కూడా ఉంది. మున్సిపల్ అధికారులు, కలెక్టర్ (Collector) ఈ కాలనీని విజిట్ చేయాలి. వేరే పార్టీకి ఓటు వేశారని వాళ్లను కనీసం ప్రజలుగా కూడా చూడటం లేదు. మీకు ఓటు వేసినా, వేయకపోయినా సరే వారికి మీరే ఎమ్మెల్యే అన్న విషయాన్ని ఇక్కడి ఎమ్మెల్యే గుర్తించాలి. ఎమ్మెల్యే మానవతా దృక్పథంతో స్థానిక ప్రజలకు మేలు చేయాలి. కాలనీ వాసుల సమస్య తీరే వరకు స్థానిక జాగృతి నాయకులు వారి తరఫున పోరాటం చేస్తారు అని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News