Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌JubileeHills | ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ అవకతవకలు

JubileeHills | ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ అవకతవకలు

ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఆరోపణలు
చర్యలు కోరుతూ ఈసీకి ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Bye Election)లో ఓటమి భయంతో అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) అనేక అవకతవకలకు పాల్పడుతోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ (BRS Party) తీవ్ర ఆరోపణలు చేసింది. బోగస్ ఓటింగ్‌కు, రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తోందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్న ఆ పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎన్నికల సంఘానికి (Election Commission) ఫిర్యాదు (complaint) చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ నేతలు ఆధిపత్యం (Domination) చెలాయిస్తున్నారని, పోలీస్ (Police) వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. చట్ట వ్యతిరేక చర్యలకు దిగుతున్నారని, బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగుతూ ప్రచారానికి ఆటంకాలు కలిగిస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పుట్టినరోజు వేడుకల (Birth Day Celebrations) పేరుతో బహిరంగంగా లంచాలు ఇస్తున్నారని, తద్వారా ఓట్లు (Votes) కొనుగోలు చేస్తున్నారని అభ్యంతరం వెలిబుచ్చారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు మౌనంగా ఉండిపోతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికే అవమానమని తప్పుపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News