- రెండేళ్లుగా రెమ్యూనరేషన్ అందక నిరుత్సాహంలో నర్సంపేట డివిజన్ సూపర్వైజర్లు
నర్సంపేట: గ్రామస్థాయిలో, మండల స్థాయిలో, మున్సిపాలిటీ వార్డ్ మెంబర్స్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ కౌన్సిలర్లు తదితర ఎలక్షన్లు త్వరలో జరగనున్నాయి. ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బూతు లెవల్ ఆఫీసర్లు( బి ఎల్ ఓ) వారిపై పని చేసే బూతు సూపర్వైజర్లు వారిపై అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్( ఏ ఈ ఆర్ వో) ఆపై ఆర్డీవో స్థాయి (ఆర్వో) రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం గతంలో 2015 నుండి ప్రతి నెల 1000 రూపాయలు రెమ్యూనరేషన్ ఉండగా గత ఆగస్టులో దానిని కాస్త సంవత్సరానికి 18 వేల రెమ్యూనరేషన్ పెంచి ప్రకటించారు.

నర్సం నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా మండలానికి నలుగురు చొప్పున 24 మంది బిఎల్ఓ సూపర్వైజర్లు పనిచేస్తుంటారు. ఇందుకోసం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గత ఆగస్టులో ఏడాదికి 18,000 చొప్పున పెంచినప్పటికీ గత రెండేళ్ల నుండి రెమ్యూనరేషన్ అందకపోవడంతో బిఎల్వోలతోపాటు బిఎల్ఓ సూపర్వైజర్ల సైతం మీరు స్థానిక గురవుతున్నట్లు తెలుస్తుంది.
గతంలో మాదిరిగా రెండేళ్లకోసారి మూడు నెలలకు ఒకసారి ఎలక్షన్ కమిషన్ నిధులు ఇవ్వగానే బిల్లులా ఆధారంగా ఎవరి ఖాతాలో వారికి పడేటివి. గత రెండేళ్ల కాలం నుండి నిధులు ఏమైనా తెలియకుండా పోతుందని మానసికంగా కుంగి పోవాల్సి వస్తుందని బిఎల్ఓ సూపర్వైజర్లు వాపోతున్నారు. ఆయా మండల రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే ప్రభుత్వ అధికారులు బిఎల్ఓ సూపర్వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ అదనపు రెమ్యూనరేషన్ ప్రకటించిన ఎలక్షన్ కమిషన్ నిధులు ఎందుకు ఇవ్వలేకపోతుందోనని మీ మాంసంలో పడిపోతున్నారు.
నిధులు రాలే బిల్లులు చేసి ఎస్ టి ఓ లో అప్పగించాము:: నర్సంపేట తహసిల్దార్, ఏఈఆర్ఓ రవిచంద్రారెడ్డి నర్సంపేట నియోజకవర్గం బిఎల్ఓ సూపర్వైజర్లకు రెమ్యూనరేషన్ను నర్సంపేట తాసిల్దార్, (అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్) ఇవ్వాల్సి ఉంది. ఈ సందర్భంగా నర్సంపేట తాసిల్దార్ ను ఫోన్లో వివరణ కోరగా గత ఆరు నెలల క్రితమే గతంలో పనిచేసిన తహసిల్దార్ బిఎల్ఓ సూపర్వైజర్లకు రెమ్యూనరేషన్ కోసం బిల్లులు పెట్టి ఎస్ టి ఓ కు అప్పగించినట్లు తెలిసిందని, నిధులు రాకపోవడంతో వారికి అందలేకపోతున్నాయని స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ నుండి నిధులు రాగానే బిఎల్ఓ లకు బీఎల్ఓ సూపర్వైజర్లకు రెమ్యూనరేషన్ అందివ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నాడు.
