Tuesday, March 3, 2026
Homeనిజామాబాద్‌Armoor Mla | పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పైడి రాకేష్ రెడ్డి

Armoor Mla | పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పైడి రాకేష్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శాసన సభ్యుడు పైడి రాకేష్ రెడ్డి (Paidi Rakesh Reddy) గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణం పిప్రి రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ కళాశాల మైదానంలో జరిగిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(TGSWREIS) 11th జోనల్ లెవెల్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్‌కి (Games and Sports Meet) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నందిపేట్, ఆలూర్ మండలాల కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ (KalyanaLaxmi-ShadeeMubarak) చెక్కులు పంపిణీ చేశారు. ఆలూరు గ్రామాభివృద్ధి కమిటీ వినతిపత్రాలను స్వీకరించారు.

- Advertisement -

నందిపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 13న ప్రతిష్టించబోయే శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ విగ్రహ (Renuka maatha Yellamma) ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రికను నందిపేట పట్టణ గౌడ సంఘం సభ్యుల నుంచి అందుకున్నారు.

ఇటీవల నందిపేట మండలం కేంద్రానికి చెందిన తాళ్ల శ్రీనివాస్ అనారోగ్యంతో చనిపోవటంతో కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News