Friday, February 27, 2026
Homeహైదరాబాద్‌Palvai Nagesh | గాదరి కిషోర్ ఇంటిని ముట్టడిస్తాం

Palvai Nagesh | గాదరి కిషోర్ ఇంటిని ముట్టడిస్తాం

సికింద్రాబాద్.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలను మాదిగ నవనిర్మాణ సమితి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కిషోర్ వ్యాఖ్యలను ఖండిస్తూ మాదిగ నవనిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి నగేష్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కిషోర్ చిత్రపటానికి చెప్పు దెబ్బలు కొట్టిన అనంతరం తగలబెట్టారు. పాల్వాయి నగేష్ మాట్లాడుతూ గాదరి కిషోర్ తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. మంత్రుల పట్ల అసభ్య పదజాలం వాడిన గాదరి కిషోర్ ను తుంగతుర్తి ప్రజలు ఆయన పళ్లు ఊడగొట్టి తుంగతుర్తి నుంచి తరిమి కొట్టిన ఇంక నీకు సిగ్గు రాలేదంటూ మండిపడ్డారు.

ప్రజా ప్రతినిధుల పట్ల ఇష్టం వచ్చినట్టు వాడు వీడు అంటూ మాట్లాడిన మాటలను తక్షణమే కిషోర్ వెనక్కి తీసుకోవాలని లేని ఎడల తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్, బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మనబోయిన సైదులు యాదవ్, తుంగతుర్తి ఎన్ ఎస్ యు ఐ నాయకులు సృజన్, ప్రసాద్, పరమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News