Wednesday, March 4, 2026
Homeకరీంనగర్Ramagundam | ప్రాణాలర్పించి.. ప్రజల గుండెల్లో నిలిచిన వీరులు

Ramagundam | ప్రాణాలర్పించి.. ప్రజల గుండెల్లో నిలిచిన వీరులు

  • విధి నిర్వహణలో అమరులైన యోధులకు రామగుండం సీపీ నివాళులు..

శాంతిభద్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.మంగళవారం,రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ..పోలీసులు తమ త్యాగం,సేవతో నిస్వార్థానికి నిజమైన ప్రతీకలుగా నిలిచారని ప్రశంసించారు.అమరులైన పోలీసులు మహానుభావులని, వారి ఆశయాలను అనుసరించి ప్రజలకు చిత్తశుద్ధి, నీతి, నిజాయితీతో సేవ చేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం సందర్భంగా,అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు. అనంతరం, పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ముఖ్య అతిథి అయిన సీపీతో పాటు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఆర్ జి వన్ జి ఎం లలిత్ కుమార్,ఎన్టీపీసీ,ఆర్.ఎఫ్ సి.ఎల్ అధికారులు పుష్పాగుచ్ఛాలు వుంచి నివాళులు అర్పించారు.

- Advertisement -

అమరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీపీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీస్ విభాగం పూర్తి సహకారం అందిస్తుందని, ప్రభుత్వ శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్, మంచిర్యాల ఏసిపి ఆర్ ప్రకాష్,ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్,ఎవో శ్రీనివాస్,కమిషనరేట్ పరిధిలోని అన్ని ముఖ్యమైన విభాగాలు,స్టేషన్ల సీఐలు,ఎస్సైలు,
ఆర్ఐలు,సిబ్బంది,అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News