మెదక్ జిల్లాలోని కొండాపూర్ ఇండస్ట్రియల్ పార్క్(Kondapur Industrial Park)లో రూ1,000 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేసిన 36 పరిశ్రమలు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా (Industries Ready) ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 5 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ఐటీ & పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు (IT Minister Sridhar Babu) ప్రకటించారు. కొండాపూర్ పారిశ్రామికవేత్తల సంఘం (Kondapur Industrialists Association) ప్రతినిధులతో సచివాలయంలో భేటీ అయిన ఆయన.. దీని పురోగతిని సమీక్షించారు(Review Meeting). నెల రోజుల్లోపు విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని, జాతీయ రహదారికి అప్రోచ్ రోడ్డును పూర్తి చేయాలని, మిగిలిన అన్ని మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
- Advertisement -
