Homeమెదక్‌Narayanapur | విద్యుత్ షాక్ తో లైన్మెన్ మృతి

Narayanapur | విద్యుత్ షాక్ తో లైన్మెన్ మృతి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నారాయణపూర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యవసాయ బావి వద్ద కరెంట్ మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ షాక్ తో అసిస్టెంట్ లైన్మెన్ భూక్య సురేష్ (37) అక్కడిక్కడే మృతి చెందాడు. ఓ రైతుకు చెందిన వ్యవసాయ భావి వద్ద కరెంటు మరమ్మతులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసరణ జరిగి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సురేష్ అక్కన్నపేట మండలం చెరువు ముందు తండా గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.

Lineman Dies of Electric Shock in Siddipet1
- Advertisement -
RELATED ARTICLES

Latest News