Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిYoga | యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం.

Yoga | యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం.

  • మాజీ జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్.
  • యోగ గురువుకు ఘన సన్మానం.

యోగా చేయడం వల్ల శారీరక దృఢత్వం,మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్ పేర్కొన్నారు. నందిగామ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న యోగ తరగతులు ప్రారంభమై బుధవారానికి నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా షాద్ నగర్ ప్రముఖ యోగా గురువు సోమ శ్రీనివాసు గుప్తాను మాజీ జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్, అయ్యప్ప దేవాలయ కమిటీ చైర్మన్ జిల్లెల్ల బాల్ రెడ్డిలు యోగ గురువును శాలువలతో సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాతో మానసిక ఒత్తిడిని,ఆందోళనను జయించవచ్చని, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ఇది మనల్ని వ్యాధుల బారి నుండి కాపాడుతుందన్నారు.ధ్యానం చేయడం వల్ల మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిపారు.శిక్షణ శిబిరానికి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ చింతలపల్లి నర్సింలు,సోమ సురేష్,బి కృష్ణ యాదవ్,శ్రీకాంత్ గౌడ్,ఎర్ర శ్రీను,వేదం,వంపు శ్రీనివాస్ రెడ్డి,డా. రవి,మొడుసు నర్సింలు,పిట్టల కృష్ణ,కావలి రాజు,మారుతి,కావలి వెంకటేష్,ఈట మల్లేష్,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News