Saturday, June 6, 2026
Homeస్పోర్ట్స్Yashasvi Jaiswal | భారత జట్టులోకి యశస్వి జైస్వాల్..

Yashasvi Jaiswal | భారత జట్టులోకి యశస్వి జైస్వాల్..

  • ప్రకటించిన సెలెక్టర్ అజిత్ అగార్కర్..
  • ఫిట్నెస్ పరీక్షకు హాజరుకానున్న రోహిత్..

ఆఫ్ఘనిస్థాన్‌ తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టులోకి యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. గాయపడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకుంటున్నట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు. జైస్వాల్ తన చివరి వన్డేలో సౌతాఫ్రికాపై అజేయ సెంచరీ (116 పరుగులు, నాటౌట్‌) తో అదరగొట్టడం విశేషం. ఇదే సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఆడటం వారి ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు స్పష్టంచేశారు.

వెన్నునొప్పితో బాధపడుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే బెంగళూరులోని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లో రిహాబిలిటేషన్‌లో ఉండగా.. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ కూడా త్వరలో అక్కడికి చేరుకుని ఫిట్‌నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నప్పుడు కోహ్లీకి తొడ కండరానికి గాయమైంది. ఆ మ్యాచ్‌లో 75 పరుగులతో జట్టును గెలిపించినప్పటికీ ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువవడంతో అతడు ఈ సిరీస్‌కు దూరమవాల్సి వచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News