Thursday, March 26, 2026
Homeమెదక్‌Yasangi | యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభం

Yasangi | యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభం

  • బోనస్ ఎక్కడ అని నిలదీసిన రైతులు..!

కుకునూరుపల్లి మండల తిప్పారం గ్రామంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
అయితే కార్యక్రమం తర్వాత రైతులు గత యాసంగి సీజన్‌లో సన్న వడ్లకు ప్రకటించిన బోనస్ ఇప్పటికీ ఖాతాల్లో జమ కాలేదని నిలదీశారు.

దీనిపై దేవేందర్ రెడ్డి స్పందిస్తూ, “బోనస్ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కారం కోసం కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ అమరేందర్, కోరే నరేష్ కుమార్ ఈసాల కర్ణాకర్ చరణ్ భోగి కనకయ్య పంచాయతీ కార్యదర్శి మమత వ్యవసాయ అధికారి శ్రీహరి రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News