Homeఆదాబ్ ప్రత్యేకంSainikpuri Bhavans | సైనిక్ పురి భవన్స్ సాక్షిగా.. పచ్చని చెట్ల నరికివేత..

Sainikpuri Bhavans | సైనిక్ పురి భవన్స్ సాక్షిగా.. పచ్చని చెట్ల నరికివేత..

  • అక్రమంగా చెట్లను కొట్టి అమ్ముకుంటున్న పిల్లి రాము అండ్ కో..
  • చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్స్..
  • ఎంక్వయిరీకి వచ్చిన అధికారులు ఏ చర్యలు చేపట్టకపోవడం ఏమిటి..?
  • భారతీయ అటవీ చట్టం ప్రకారం ఇది తీవ్రమైన నేరం..
  • జైలు శిక్షతోబాటు జరిమానా విధించే అవకాశం..
  • ఇదే విషయంపై ఫిర్యాదులు చేసిన వారిని సంస్థ నుంచి క్రమంగా తొలగింపు..
  • అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్స్..
  • దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భవన్స్ విద్యా సంస్థ..
  • సైనిక్ పురి భవన్స్ వ్యవహారంపై ఫారెస్ట్ మినిస్టర్ కొండా సురేఖ తక్షణమే స్పందించాలని కోరుతున్న స్థానికులు..

అక్షరాలు దిద్దించాల్సిన చోట గొడ్డలి వేటు పడుతోంది. విద్యార్థులకు ప్రాణవాయువును అందించాల్సిన వృక్షాలు.. కొందరి స్వార్థానికి బలైపోతున్నాయి. సైనిక్ పూరిలోని ప్రతిష్టాత్మక భవన్స్ విద్యాసంస్థల ఆవరణలో గత 30 ఏళ్లుగా పెంచి పోషించిన సుమారు 1000 చెట్లను అత్యంత దారుణంగా నరికివేసి, సొమ్ము చేసుకుంటున్న వైనం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది.

Sainikpuri Bhavans Tree Felling Scandal

సైనిక్ పురి భవన్స్‌లో పర్యావరణ దారుణానికి ప్రధాన కారకులుగా జూనియర్ కాలేజీ పీటీ పిల్లి రాము, పులికంటి స్వప్నలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వీరికింద పనిచేస్తున్న కేర్ టేకర్ బి. కుమార్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ భోగేశ్వర రావులపై యాక్షన్ తీసుకోవడానికి సదరు పిల్లి రాము ఎందుకు వెనుకాడుతున్నారు.. అంటే ఈ చెట్లు నరికివేత వ్యవహారంలో వీరందరూ కలిసే చేస్తున్నారా అన్నది అనుమానా స్పదంగా మారింది. కాగా చెట్లు నరికివేస్తున్నారని, అమ్ము కుంటున్నారని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రధాన అధికారికి పీ. బాలయ్య, ఎం. ప్రభుదాస్, పత్తిపాటి నారాయణ అనే వ్యక్తులు ఫిర్యాదు చేశారు..

- Advertisement -
Sainikpuri Bhavans Tree Felling Scandal01

ఫిర్యాదు అందుకున్న అధికారులు విచారణ జర పడానికి సైనిక్ పురి, భవన్స్‌కి చేరుకుని తూ తూ మంత్రంగా పరిశీలించి తర్వాత వస్తామని చెప్పి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. కళ్ళముందే నరికివేయబడ్డ చెట్టు మొదళ్ళు కనిపిస్తున్నా, కొన్ని చెట్ల మొద్దుల నుంచి పాలు కారుతున్నా, మరికొన్ని నరికివేయబడి మిగిలిన ఆనవాళ్లపై ఆకులు, ఇతరాలు కప్పబడి ఉన్నా వాటిని సాక్షాలుగా గుర్తించ కుండా అధికారులు ప్రవర్తించడం ఏమిటని ఫిర్యాదుదారులు వాపోతున్నారు..

విచా రణకు వచ్చిన సంబంధిత అధికారులను పిల్లి రాము, పులికంటి స్వప్నలు ఏదోలా మేనేజ్ చేశారని అందుకే ఫారెస్ట్ అధికారులు గానీ, పోలీసులు గానీ మౌనంగా తిరిగి వెళ్లి పోయారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు.. కాగా తాముచేసే అక్రమం బయట ప్రపంచానికి తెలియ కుండా ఉండటా నికి భవన్స్ చుట్టూ ఉన్న 14 గేట్లను షీట్లతో కప్పివేశారు. సాయంత్రం వేళల్లో దొంగచాటుగా క్రికెట్ అకాడమీ గేటు గుండా ఈ వృక్ష సంపదను తరలిస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి..

Sainikpuri Bhavans Tree Felling Scandal1

సంస్థలోని 13 మంది సెక్యూరిటీ సిబ్బంది తమ కళ్లముందే ఇంత జరుగుతున్నా వారు మౌనంగా ఉండటం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ అక్రమాలను ప్రశ్నించిన చిత్తశుద్ధి కలిగిన ఉద్యోగులపై దౌర్జన్యాలు చేయడమే కాకుండా, వారిని అకారణంగా విధుల్లో నుంచి తొలగించి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రిన్సిపాల్స్ వంటి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు కూడా ఈ విషయంలో నోరు మెదపకపోవడం విచారకరం.

Sainikpuri Bhavans Tree Felling Scandal2

ఒక విద్యాసంస్థ పరిథిలో పర్యావరణాన్ని రక్షించాల్సింది పోయి, ఇలా పచ్చని చెట్లను తెగనరకడం కేవలం నేరం మాత్రమే కాదు, భావితరాల మనుగడపై దాడి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని పిల్లి రాము, పులికంటి స్వప్న వారి వెనుక ఉన్న సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నరికివేసిన చెట్ల విలువను రికవరీ చేసి, ఆ స్థలంలో తిరిగి మొక్కలు నాటించేలా చర్యలు చేపట్టాలి.

కాగా వృక్ష సంరక్షణ చట్టం అంటే వాల్టా చట్టం 2002 ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చెట్లను రక్షించడా నికి ఈ చట్టం అత్యంత కీలకం. సెక్షన్ 28 ప్రకారం ఏదైనా చెట్టును నరకాలంటే సంబంధిత అథారిటీ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా నరికితే అది నేరం. చెట్టును నరికినందుకు గానూ ఒక్కో చెట్టుకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు జరిమానా విధించవచ్చు. నేరం పునరావృతమైతే లేదా భారీ స్థాయిలో చెట్లు నరికితే జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నరికిన కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.

Sainikpuri Bhavans Tree Felling Scandal3

ఇందులో టేకు చెట్లను నరకడం అత్యంత తీవ్రమైన నేరం. టేకును “రిజర్వుడు ట్రీ” గా పరిగణిస్తారు. సొంత పట్టా భూమిలో ఉన్న టేకు చెట్టును నరకాలన్నా అటవీ శాఖ నుంచి ప్రత్యేక పర్మిట్ ఉండాలి. అనుమతి లేకుండా టేకు నరికితే తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ సెక్షన్ 20 ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయి. దీనికి జరిమానాతో పాటు తప్పనిసరిగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ సంబంధిత అధికారులు నిందితులతో చేతులు కలిపినట్లు ఆధారాలు ఉంటే, వారిపై అబెడ్మెంట్ క్రైం అంటే నేరానికి సహకరించడం..

Sainikpuri Bhavans Tree Felling Scandal002

విధులపట్ల నిర్లక్ష్యం కింద ఉన్నతాధికా రులకు లేదా లోకాయుక్తకు ఫిర్యాదు చేయవచ్చు. మరి నిర్దాక్షిణ్యంగా టేకు చెట్లను కూడా నరికివేసి అమ్ముకున్న పిల్లి రాము అండ్ గ్యాంగ్ కు ఎలాంటి శిక్షలు విధిస్తారో చూడాలి.. ఈ వ్యవ హారంలో ఉన్నతాధికారులు, రాష్ట్ర అటవీశాఖ మంత్రి కలుగజేసు కుని తగిన పరిష్కారం చూపాలని, నిందితులకు శిక్ష పడేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News