Friday, April 17, 2026
Homeఆదిలాబాద్Seized | అక్రమంగా నిల్వ ఉంచిన 54 గ్యాస్ సిలిండర్ లు స్వాధీనం

Seized | అక్రమంగా నిల్వ ఉంచిన 54 గ్యాస్ సిలిండర్ లు స్వాధీనం

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈదిగాం సమీపంలో గల సంతోష్ హెచ్ పీ గ్యాస్ ఏజెన్సీ డీలర్ ఇంట్లో సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గురువారం దాడులు చేపట్టారు. శాస్త్రి నగర్ లోని డీలర్ సంతోష్ నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 54 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారులకు సరైన సమయంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయకుండా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. సదరు డీలర్ పై కేసు నమోదుచేసి ఏజెన్సీని రద్దు చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News