Homeనల్లగొండSpirituality | భక్తులలో ఆధ్యాత్మిక భావనకు ప్రచార రథం సిద్ధం

Spirituality | భక్తులలో ఆధ్యాత్మిక భావనకు ప్రచార రథం సిద్ధం

  • యాదాద్రి ఆలయ విశిష్టతకు,ధర్మ ప్రచారానికి ఆలయ ఈవో కృషి
  • రాష్ట్రం నలుమూలలకు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ విశిష్టతను,ఆధ్యాత్మిక భావనను భక్తులలో పెంపొందించడం కొరకు ధర్మ ప్రచార నిమిత్తం,రాష్ట్రం నలుమూలల చాటి చెప్పేందుకు ప్రచార రథం సిద్ధం చేశారు దేవస్థానం అధికారులు.ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకట్రావు మాట్లాడుతూ గత కొంతకాలంగా రిపేరులో ఉండి వాడుకలో లేనటువంటి ప్రచార రథాన్ని తిరిగి రిపేర్లు చేయించి, అన్ని సౌకర్యాలతో వాడుకలోకి తీసుకొచ్చారు.ఈ ప్రచార రథం రాష్ట్రం నలుమూలలకు వెళ్లి యాదాద్రి క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన చరిత్రను స్వామివారి మహత్యాన్ని తెలియజేస్తూ మరియు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించేందుకు దేవస్థానం సంకల్పించింది.

Yadadri Spiritual Promotional Chariot Launch 1

అందులో భాగంగా మొదటగా డిసెంబర్ మూడు నాలుగు వారాలలో భూపాలపల్లి, నాగర్ కర్నూల్, జిల్లాలలో ప్రచారం చేసి ఆధ్యాత్మిక భావన హిందూ ధర్మ విశిష్టతను,స్వామివారి వైభవాన్ని తెలిపేందుకు, అలాగే స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహింపబడడానికి ప్రత్యేకమైన అధికారులను, నియమించింది.ఇందులో భూపాలపల్లికి,ఏఈఓ నవీన్,నాగర్ కర్నూల్ కు గజవెల్లి రఘు ను నియమిస్తూ ఆలయ ఈవో ఆదేశాలు జారీ చేశారు.ఇకమీదట దశలవారీగా వివిధ ప్రాంతాలకు ప్రచార రథమును పంపుచు,ఆలయ విశిష్టతను,ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.

Yadadri Spiritual Promotional Chariot Launch 2
- Advertisement -
RELATED ARTICLES

Latest News