Homeరంగారెడ్డిProtest | మహిళల హక్కుల కోసం బాలాజీనగర్ చౌరస్తాలో రాస్తా రోకో

Protest | మహిళల హక్కుల కోసం బాలాజీనగర్ చౌరస్తాలో రాస్తా రోకో

దేశ మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళలకు సమాన హక్కులు కల్పించే చారిత్రాత్మక నిర్ణయమని స్థానిక మహిళా నాయకులు పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ అవకాశాలు విస్తరించే ఈ బిల్లును వ్యతిరేకించడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Women Reservation Bill Protest Rasta Roko Balajinagar Junction

మహిళల హక్కుల విషయంలో పెద్ద పెద్ద ప్రకటనలు చేసే కాంగ్రెస్ కూటమి ఈ బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించడం అన్యాయమని విమర్శించారు. మహిళల అభివృద్ధిని అడ్డుకునే విధానాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిరసనగా బాలాజీనగర్ చౌరస్తాలో మహిళలు, నాయకులు కలిసి రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొని నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకుని మహిళల పక్షాన నిలవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News