Sunday, April 19, 2026
Homeమహబూబ్‌నగర్‌DIEO | ఇంటర్మీడియట్ విద్యాధికారిగా సి. రమణి బాధ్యతల స్వీకరణ.

DIEO | ఇంటర్మీడియట్ విద్యాధికారిగా సి. రమణి బాధ్యతల స్వీకరణ.

మహబూబ్‌నగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారిగా(DIEO) సి. రమణి శనివారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా నియమిత మైన జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి సి.రమణి జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ను మర్యాదపూర్వకంగా కలిశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటర్మీడియట్ విద్య అధికారిగా పనిచేస్తున్న రమణిని రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్య శాఖ డైరెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారిగా బదిలీ చేశారు.

ఇంటర్మీడియట్ విద్య ఇంచార్జి అధికారి గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కౌసర్ జహాన్ నుండి బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆమె ను పలువురు అధ్యాపకులు అభినందించారు. ఈ సందర్భంగా రమణి మాట్లాడుతూ, జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని, అందరి సహకారం కావాలని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News