- తాడ్వాయి ఎంపిడివో భరత్ కుమార్.
మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకుతో పాటు,ఆర్థికంగా మహిళలు బలోపేతంగా అయ్యేందుకు డ్వాక్రా సంఘాలు ఎంతగానో తోడ్పడతాయని తాడ్వాయి ఎంపీడీవో భరత్ కుమార్ అన్నారు.ఆయన మంగళవారం తాడ్వాయి మండల కేంద్రంలోని ఐకెపి భవన్ లో జరిగిన 19వ వార్షిక మహాసభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలు పొదుపు సంఘాల ద్వారా తమ డబ్బులు పొదుపు చేసుకోవాలని, ఐకెపి ద్వారా వచ్చే రుణాలతో చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలు కూడా మహిళలు వినియోగించుకోవాలన్నారు.
అనంతరం గ్రామీణ అభివృద్ధి సంస్థ డిపిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలందరూ చదువుకోవడం ద్వారా పేదరికం నుండి బయటపడవచ్చు అని ప్రభుత్వం వయోజనుల కోసం కేటాయిస్తున్న విద్య వసతులను వినియోగించుకొని నిరక్షరాశులు అక్షరాసులుగా మారాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడం వల్ల జీవితంలో ఉన్నత స్థితికి చేరవచ్చునని మహిళలు పోటీ పరీక్షలో అర్హత సాధించడం వల్ల ఉద్యోగాలు పొందవచ్చునని ఈ సందర్భంగా ఆయన దాఖల మహిళలకు సూచించారు.


ఈ సందర్భంగా మండల ఐకెపి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షురాలుగా సత్యభాయి, కార్యదర్శి లక్ష్మీ నర్సవ్వ,కోశాధికారి గా అనూషను, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనిధి ఎంఆర్ కిరణ్,ఏపీఎం రాజు, సీసీలు మెహర్ కుమార్, రాజిరెడ్డి, కృష్ణ,అంజలి,నర్సింలు, శ్రీనివాస్, అంజయ్య, రాజయ్య,అకౌంటెంట్ తిరుపతి రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ సౌజన్య వివిధ గ్రామాల వివోలు మండల అధ్యక్షురాలు పాల్గొన్నారు
