- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గడ్డుకాలమా.?
- మున్సిపల్ ఎన్నికలో బీజేపీ-బీఆర్‌ఎస్ జతకట్టే అవకాశాలపై ఊహాగానాలు.!
- పట్టణ రాజకీయాల్లో కొత్తలెక్క..బీజేపీ-బీఆర్‌ఎస్..కలయికపై చర్చ.!
- వికారాబాద్ ఎన్నికల సమరంలో అనూహ్య మలుపు?
- బీజేపీ-బీఆర్‌ఎస్ రహస్యవ్యూహాలు.. నిజమేనా?
- బీజేపీ-టీఆర్‌ఎస్ కలిసి.. పోటీ చేస్తారన్న ప్రచారం.!
- మున్సిపల్ బరిలో బీజేపీ-టీఆర్‌ఎస్ స్నేహం నిజమేనా ?
- వికారాబాద్ మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.! మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.
- వికారాబాద్ మున్సిపల్‌లో కాంగ్రెస్ నాయకులు..మాజీ సబితా ఇంద్రారెడ్డి వర్గమేనా?
- వికారాబాద్ జిల్లా కేంద్రంలో వేడెక్కిన రాజకీయ వాతావరణం.!
వికారాబాద్ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో నాయకుల్లో అంతర్గత విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీన పడ్డట్టు కనబడుతుంది. కలిసికట్టుగా మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు పోవాలన్న కాంగ్రెస్ వ్యూహాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు నాయకుల విభేదాలతో కాంగ్రెస్ పార్టీ పట్టు తప్పి ఉందని చర్చ కొనసాగుతుంది. మున్సిపల్ ఎన్నికలలో వ్యూహాత్మకంగా పార్టీ నాయకులు ముందుకు కదులుతున్నప్పటికీ ప్రజల నుండి గట్టి సవాల్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది.
ఫ్లెక్సీల గొడవ మాటల యుద్ధం కాంగ్రెస్ పార్టీలో కొమ్ములాట ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ పడే అవకాశం కనబడుతుంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో రాజకీయాల్లో మరో కీలక మలుపుగా రానున్న మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకు పరీక్షగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు గడ్డుకాలంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సవాళ్లు, అంతర్గత విభేదాలు, నాయకత్వ లోపాలు పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయి.

పట్టణ రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీనత..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ రాజకీయాల్లో అదే స్థాయి ప్రభావాన్ని చూపలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో స్థానిక నాయకత్వం బలహీనంగా ఉండటం, క్యాడర్ యాక్టివ్‌గా లేకపోవడం పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం కనబడుతుంది. అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు వేగంగా సాగకపోవడం, వికారాబాద్ పట్టణంలో డ్రైనేజీ రోడ్ల సమస్య ప్రజలకు ఇతర ఇతర సమస్యలు పరిష్కరించడంలో అధికార పార్టీ ఏమాత్రం ముగ్గు చూపలేదని వికారాబాద్ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాల ఫలితాలు స్పష్టంగా కనిపించకపోవడం కాంగ్రెస్‌పై అసంతృప్తిని పెంచుతోంది.
జిల్లా నాయకత్వం లేకపోయినా బీజేపీ దూకుడు..
వికారాబాద్ పట్టణాల్లో పట్టుదలతో మరోవైపు బీజేపీ పట్టణ ప్రాంతాల్లో తన పట్టు మరింత బలపరుచుకునే ప్రయత్నాల్లో ఉంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ఉన్న బలం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ చూపుతున్న చురుకుదనం మున్సిపల్ ఎన్నికల్లో కీలకంగా మారనుంది.
పట్టణ మధ్యతరగతి, యువతలో బీజేపీకి ఉన్న ఆదరణ కనబడుతుంది. జిల్లా నాయకత్వం లేకపోయినప్పటికీ బీజేపీ నాయకుల పట్టుదలతో ముందుకు సాగే అవకాశాలు కనబడుతున్నాయి. బిజెపి వ్యూహాత్మకంగా ముందుకు పోతే కాంగ్రెస్‌కు ఆందోళన కలిగించే అంశం అని చర్చ సాగుతుంది

ప్రజల్లో వ్యతిరేకత తెచ్చే విధంగా ప్రచారాలు కొనసాగేలా చూస్తున్న బీఆర్‌ఎస్.!
వికారాబాద్ పట్టణంలో బీఆర్‌ఎస్ పునరాగమనం వ్యూహం, అధికారాన్ని కోల్పోయినప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా రాజకీయంగా బలహీనపడలేదనే చెప్పాలి. మున్సిపల్ స్థాయిలో బీఆర్‌ఎస్‌కు ఇంకా బలమైన నెట్‌వర్క్ ఉంది. గతంలో మున్సిపాలిటీల్లో కొనసాగిన అనుభవం, స్థానిక నాయకుల పట్టుబలం బీఆర్‌ఎస్‌కు ప్రధాన ఆయుధాలుగా మారుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-బీఆర్‌ఎస్ జతకట్టే అవకాశాలులి?
వికారాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్య పొత్తు అంశం. బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ, మున్సిపల్ ఎన్నికల వంటి స్థానిక స్థాయిలో వ్యూహాత్మకంగా అవగాహనకు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలన్న ఉమ్మడి లక్ష్యంతో మున్సిపాలిటీల్లో పరోక్ష సహకారం లేదా అవగాహన ఉండవచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
త్రికోణ పోటీ – కాంగ్రెస్‌కు ప్రమాద ఘంటికలు
బీజేపీ, బీఆర్‌ఎస్ వేర్వేరుగా పోటీ చేసినా, లేదా కొన్ని చోట్ల కలిసి ముందుకు వచ్చినా, త్రికోణ పోటీ కాంగ్రెస్‌కు మరింత నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఓటు చీలిక, అసంతృప్తి ఓటు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి కనిపిస్తోంది.
అంతర్గత విభేదాలు – కాంగ్రెస్‌కు పెద్ద శాపం కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరో పెద్ద సమస్యగా మారాయి. టికెట్ల పంపిణీ నుంచి స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరు వరకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవన్నీ కలిసొచ్చి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ముగింపు మొత్తంగా చూస్తే రాబోయే మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేయనున్నాయి. కాంగ్రెస్‌కు ఇది గట్టి పరీక్ష కాగా, బీజేపీ తన పట్టణ బలాన్ని విస్తరించుకునే అవకాశంగా భావిస్తోంది. బీఆర్‌ఎస్ మాత్రం ఈ ఎన్నికలను రాజకీయ పునరాగమనానికి వేదికగా మలచుకోవాలని చూస్తోంది. బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్య జతకట్టే అవకాశం నిజమైతే, కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు మరింత గడ్డుకాలంగా మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఎంపీ ఎన్నికల్లో ఏం జరిగింది
చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ ఎన్నికలలో బిజెపి పార్టీకి ఓటు బ్యాంకు లేనప్పటికీ 1,70,000 ఓట్లకు పైగా బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎంపీస విశ్వేశ్వర్ రెడ్డి కి పోటీగా గడ్డం రంజిత్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓటమిపాలయ్యారు టిఆర్‌ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారిన గడ్డం రంజిత్ రెడ్డి కి టిఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని ఆశాభావాలతో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుండి చేవెళ్ల ఎంపీ బరిలో ఉండి ఓటమిపాలయ్యాడు. ఎంపీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ బిజెపి పార్టీకి పొత్తులు లేకపోయినప్పటికీ ప్రజలు మాత్రం బిఆర్‌ఎస్ బిజెపి జతకట్టి బిజెపి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు.
ఎంపీ ఎన్నికలు జరిగినట్టే మున్సిపల్ లో జరుగుతుందని చర్చ జోరుగా సాగుతుంది. పార్టీ నాయకులు జతకట్టకపోయినా ప్రజలు మాత్రం ఏకధాటిగా జతకట్టుకొని కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ పెట్టాలని ఆలోచనతో ప్రజలు ముందుకు వెళ్తున్నారని చర్చ వికారాబాద్ జిల్లాలో జోరుగా సాగుతుంది.ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో పట్టణాల ప్రజలు వేచి చూడాలి.
