Thursday, May 28, 2026
HomeతెలంగాణSridhar Babu | విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి..

Sridhar Babu | విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి..

  • శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధం..
  • దావోస్ పెట్టుబడులపై మంత్రి శ్రీధర్ బాబు..

దావోస్ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రభుత్వం పెట్టుబడిదారులతో 44 ఎంవోయూలను కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దావోస్ పెట్టుబడులు, ఎంవోయూలపై శాసనసభలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలు, విమర్శలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తుంటే విపక్షాలు ఓర్వలేక విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం చేసే ఆరోపణలు రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దావోస్ పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 68,150 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఒప్పందాల ద్వారా బహుళ ప్రయోజనాలు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News