Friday, November 14, 2025
ePaper
Homeఅంతర్జాతీయంDeadlock | 31 రోజుల్లో రూ. 62 వేల కోట్ల సంపద ఆవిరి

Deadlock | 31 రోజుల్లో రూ. 62 వేల కోట్ల సంపద ఆవిరి

  • కీలక బిల్లుల విషయంలో అధికార, విపక్షాల మధ్య కుదరని సయోధ్య..
  • షట్ డౌన్ ప్రభావంపై కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనాలు విడుదల..
  • 8 వారాలు షట్ డౌన్ అయితే 14 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరుగుతుందని అంచనా

అమెరికాలో ప్రభుత్వం మూతపడిన పరిస్థితి 31వ రోజుకీ కొనసాగుతోంది. కీలక ఆర్థిక బిల్లుల విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య రాజీ కుదరకపోవడంతో ఫెడరల్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటివరకు సుమారు 7 బిలియన్ డాలర్ల (రూ.62,000 కోట్లకు పైగా) నష్టం వాటిల్లిందని కాంగ్రెషనల్ బడ్జెట్ కార్యాలయం అంచనా వేసింది. షట్ డౌన్ మరింత పొడిగితే నష్టం తీవ్రత పెరిగే అవకాశం ఉందని అదే సంస్థ హెచ్చరించింది. ఆరు వారాలు కొనసాగితే దాదాపు 11 బిలియన్ డాలర్లు, ఎనిమిది వారాలకుపైగా సాగితే 14 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం తలెత్తవచ్చని పేర్కొంది.

మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎకనమిస్ట్ మార్క్ జాండీ మాట్లాడుతూ, “అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బలహీన దశలో ఉంది. ఈ షట్ డౌన్ ఊహించిన దానికంటే ఎక్కువ ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు” అని వ్యాఖ్యానించారు. అలాగే కేపీఎంజీ చీఫ్ ఎకనమిస్ట్ డయాన్ స్పాంక్ మాట్లాడుతూ, “ప్రభుత్వ మూత చిన్న స్థాయిలో మొదలైనా, దీర్ఘకాలంలో ఇది ఉద్యోగాలు, వినియోగదారుల నమ్మకంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది” అని హెచ్చరించారు. 1981 నుండి అమెరికా ప్రభుత్వం మొత్తం 15 సార్లు మూతపడింది. అందులో 2018-19 మధ్య జరిగిన 35 రోజుల షట్ డౌన్ దేశ చరిత్రలోనే సుదీర్ఘమైంది. ప్రస్తుత పరిస్థితి కూడా అదే దిశగా దూసుకెళ్తుందనే ఆందోళన ఆర్ధిక నిపుణులలో వ్యక్తమవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News