Tuesday, November 11, 2025
ePaper
HomeజాతీయంLaunch | ప్రయోగానికి సిద్ధంగా సీఎంఎస్-03

Launch | ప్రయోగానికి సిద్ధంగా సీఎంఎస్-03

  • నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న శాటిలైట్
  • సముద్ర ప్రాంతంలో విస్తృత కవరేజీ
  • పౌర, వ్యూహాత్మక, నావికా సేవలు
  • ఎల్పీఎం-3 రాకెట్ ద్వార నింగిలోకి
  • కక్ష్యలోకి 4,400 కేజీలు ఉపగ్రహం
  • భారీ ఉపగ్రహ ప్రయోగం ఇదే తొలిసారి

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-30 నింగిలోకి పంపనున్నది. ఇండియన్ నేవీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఎల్బీఎం 3 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని నవంబర్ 2న నింగిలోకి మోసుకెళ్లనున్నది. ఏపీలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనున్నది. ఈ ఉపగ్రహాన్ని జీశాట్ 7ఆర్ అని పిలుస్తుంటారు. ఇది శాటిలైట్ను పూర్తిగా భారత సైన్యం అవసరాల కోసం తయారు చేసిన మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్, ఈ ఉపగ్రహం బరువు ఏకంగా 4,400 కేజీలు, భారత్ భూభాగంపై నుంచి భూస్థిర కక్షలోకి ఇంతటి బరువైన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడం ఇదే ప్రథమం.

గతంలో చంద్రయాన్-3 మిషన్ కార్యక్రమం కోసం ఎల్ వీఎం- 3 రాకెట్ను వినియోగించారు. ఈ రాకెటు ఇప్పటిదాకా నాలుగుసార్లు ఉపయోగించారు. 43.5 మీటర్లు పొడవు కలిగిన ఎల్వీఎం3 రాకెట్ ప్రయోగం ప్రారంభసమయంలో 642 టన్నుల బరువుతో నింగికి పయన మవుతుంది. ఎల్ఎం౩ఎంగ్ రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ సమయం ముగిసే సరికి రాకెట్కు రెండువైపులా వున్న ఎస్200 స్ట్రాపాన్ బూస్టర్లు మండి 642 టన్నుల బరువు కలిగిన రాకెట్ను భూమి నుంచి నింగివైపునకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అంటే 25.30 గంటల కౌంట్ డౌన్ కొనసాగిన అనంతరం 4,400 కిలోల బరువు కలిగిన సీఎంఎస్ 03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని మోసుకుని నింగివైపునకు దూసుకెళతుంది. ప్రయోగం ప్రారంభమైన అనంతరం 16.09 నిమిషాల్లో పూర్తిచేసి ఉపగ్రహాన్ని నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెడతారు.

ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చీఫ్ వి. నారాయణన్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఎల్బీ ఎం3 ఎంగ్ రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. దర్శ నానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం టిటిడి అధికారులు ఇస్రో చీఫ్కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ, రేపు ఎల్బీ ఎం3 ఎం5 ప్రయోగం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎల్బీఎం 3 ఎంక్ లాంచ్ వెహికల్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టే కమ్యూనికేషన్ ఉపగ్రహంగా తెలిపారు. ఇది అత్యంత బరువైన ఉపగ్రహం అఅని చెప్పారు. దీని బరువు 4,410 కిలోలు అని వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News