Wednesday, December 10, 2025
EPAPER
Homeసాహిత్యంOld Man | వృద్ధుడను.. వ్యర్థుడను..

Old Man | వృద్ధుడను.. వ్యర్థుడను..

వాలిపోయే వృక్షమును.. రాలిపోయే పుష్పమును..
ఎండిపోయే కొమ్మను.. ఊడిపడే ఆకును..
ఆరిపోయే దీపమును.. ఆగిపోయే గుండెను..
బీడుబోయిన పొలమును.. తగలబెట్టిన పంటను..

ఆకర్షణలేని రూపమును.. ఆకట్టుకోలేని అక్షరమును..
పుచ్చిపోయిన విత్తనమును.. చెడిపోయిన ఫలమును..
పదునులేని ఖడ్గమును.. సిరాలేని కలమును..
వయసు మీరిన వృద్ధుడను.. శక్తిలేని అసమర్ధుడను..

- Advertisement -

అస్తమిస్తున్న సూరీడును.. కదలలేకున్న కలమును..
రాహువు మింగుతున్న చంద్రుడను.. కూలుతున్న తారను..
జుట్టులేని శిరమును.. ఊహలుడిగిన మనసును..
చూపు మందగించిన అంధుడను.. వినికిడి తగ్గిన బధిరుడను..

కరిగిపోయే కాలమును.. ఎగిరిపోయే దూదిపింజను..
కాల్చబోయే కాయమును.. గోడకేలాడబోయే చిత్రమును..
రాయాలనుకున్నా.. కవితలు కూర్చలేనివాడను..
సాహితీసేవను.. సాగించలేనివాడను..

డబ్బులు లేనివాడను.. జబ్బులు ఉన్నవాడను..
ఇంటికి బరువును.. భూమికి భారమును..
ఏమైనా అక్షరాల్లో.. ఇంకా మండుతుంటా..
మదుల్లో మెదులుతుంటా.. జనాల్లో జీవిస్తుంటా..

  • గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్
- Advertisement -
RELATED ARTICLES

Latest News