Tuesday, April 21, 2026
Homeఆదిలాబాద్Excellence | తెలంగాణ మైనారిటీ ఇంటర్ విద్యార్థుల ప్రభంజనం

Excellence | తెలంగాణ మైనారిటీ ఇంటర్ విద్యార్థుల ప్రభంజనం

బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ మైనారిటీ పాఠశాల మరియు కళాశాలలో 2025-26 సంవత్సరంలో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చాటినందుకు ఈ రోజు కళాశాల విద్యార్థులను మంచిర్యాల కలెక్టరేట్లో వారిని సన్మానించడం జరిగింది . ఈ కార్యక్రమంలో మంచిర్యాల కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, డి.యం.డబ్లు.ఓ. నీరటి రాజేశ్వరి, ఆర్.ఎల్.సి. ఆసిఫాబాద్,మంచిర్యాల జిల్లా షగుఫ్తా ఫిర్దౌస్ విజిలెన్స్ ఆఫీసర్ తహరుద్దీన్ , అకాడమిక్ కోఆర్డినేటర్ రిజ్వాన్, మంచిర్యాల ప్రిన్సిపల్ సంధ్యా, బెల్లంపల్లి ప్రిన్సిపల్ యం.డి. నీలు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

కలెక్టర్ విద్యార్థుల ప్రతిభను పొగుడుతూ ఇంకా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని విద్యార్థులతో మాట్లాడి, తల్లిదండ్రులను అభినందించారు. రాష్ట్రంలోనే రెండవ స్థానంలో మైనార్టీ విద్యార్థులు సాధించినందుకు గర్వకారణమని పొగడటం జరిగింది. ఈ ప్రతిభ అధ్యాపకుల మరియు ప్రిన్సిపల్స్ కృషి ఫలితమే అని వారిని అభినందించడం జరిగింది. మైనారిటీ గురుకులం(టెమ్రిస్)లో తమ పిల్లల్ని చేర్పించాలని తల్లిదండ్రులను ప్రోత్సహించడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News