Tuesday, June 2, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | అమరుల కలల తెలంగాణ ఇదేనా?

Aaj Ki Baath | అమరుల కలల తెలంగాణ ఇదేనా?

ఎందరో తల్లుల కడుపు కోతలు… మరెందరో యువకుల ప్రాణ త్యాగాల పునాదుల మీద వెలిసింది ‘తెలంగాణ’ కోట! కానీ, అమరవీరుల రక్తాన్ని సిరాగా మార్చుకుని…రాజకీయ నాయకులు తమ గద్దెలను పదిలం చేసుకున్నారు.. నాడు పరాయి పాలనలో బానిసత్వానికి ఎదురొడ్డి నిలిస్తే, నేడు స్వరాష్ట్రంలో స్వార్థపరుల మోసాలకు బలైపోతోంది సామాన్యుడి బతుకు.. గద్దెనెక్కిన పాలకులకు పదవుల పండగ…రక్తం ధారపోసిన బిడ్డలకు మాత్రం తీరని ఆవేదన! నీళ్లు, నిధులు, నియామకాల నినాదం… రాజకీయ కుట్రల మధ్య నేటికీ ఎండమావిగానే మిగిలింది. ప్రాణాలు అర్పించిన అమరులారా క్షమించండి… మీరు కలలుగన్న ‘బంగారు తెలంగాణ’ పాలకుల జేబుల్లో నిండిపోయింది, కానీ, గొంతు ఎండిన సామాన్య ప్రజల కన్నీళ్లలో ఇంకా మిగిలే ఉంది..!

  • బీవీఆర్ రావు..
- Advertisement -
RELATED ARTICLES

Latest News