Wednesday, December 10, 2025
EPAPER
Homeనిజామాబాద్‌Kavitha | ‘కామారెడ్డి డిక్లరేషన్’ కోసం కామారెడ్డిలో రైల్ రోకో

Kavitha | ‘కామారెడ్డి డిక్లరేషన్’ కోసం కామారెడ్డిలో రైల్ రోకో

కాంగ్రెస్ పార్టీ (Congress Party) కామారెడ్డి డిక్లరేషన్‌(Kamareddy Declaration)లో ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల (BC Reservations) హామీని వెంటనే నెరవేర్చాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు (Telangana Jagruti President) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైల్ రోకో (Rail Roko) చేపట్టారు. దీంతో కవితను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఈ రైల్ రోకో ద్వారా తాము ఢిల్లీకి దృఢమైన సందేశాన్ని పంపుతున్నామని చెప్పారు. బీసీలకు హక్కుగా చెందాల్సిన వాటిని నిరోధించడం బిజెపి ఆపాలని కోరారు. కాంగ్రెస్ తన సొంత హామీ నుంచి పారిపోకూడదు అని చెప్పారు. తెలంగాణ జాగృతి 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం దృఢంగా నిలుస్తుందని తేల్చిచెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News