HomeతెలంగాణLaunch | జాగృతి కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ పోస్టర్ల ఆవిష్కరణ

Launch | జాగృతి కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ పోస్టర్ల ఆవిష్కరణ

  • 25న భారీ సభకు సన్నాహాలు

హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన సభ పోస్టర్లను తెలంగాణ జాగృతి అధినేత క‌ల్వ‌కుంట్ల క‌విత చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల ముఖ్య ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 25న మేడ్చల్ జిల్లా మునిరాబాద్‌లోని అద్వైత కన్వెన్షన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Jagruthi Warangal Meeting Poster Launch

ఈ సభతో కొత్త ప్రాంతీయ రాజకీయ శక్తి ఆవిర్భావానికి నాంది పలుకుతుందని నాయకులు తెలిపారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశను చూపే పార్టీగా ఇది అవతరిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక అసమానతలను తగ్గించే లక్ష్యంతో యువత, మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ సభను విజయవంతం చేయడానికి కార్యకర్తలు, ఉద్యమకారులు, బహుజన, గిరిజన, దళిత వర్గాలు భారీగా తరలివచ్చేలా పిలుపునిచ్చారు.

- Advertisement -
Jagruthi Warangal Meeting Poster Launch01

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు మారుపేల్లి మాధవి, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పర్లపల్లి శ్రీశైలం, యూత్ రాష్ట్ర నాయకుడు తాడిగోప్పుల మల్లేష్, మహబూబాబాద్ సీనియర్ నాయకుడు గంధసిరి వేణు, వరంగల్ మహిళా అధ్యక్షురాలు నూకల రాణి, జిల్లా నాయకులు కుసుమ రాజు, నడిపల్లి వెంకటేశ్వర రావు, సొల్తీ కిషోర్, జున్ను రాజు యాదవ్, రోహిత్ రెడ్డి, రమేష్, జన్ను సంతోష్, జనగాం నాయకుడు ఆంజనేయులు, భూపాలపల్లి నుంచి నరేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News