- సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారీ
భారత దేశంలో అణగారిన వర్గాల కొరకు బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన త్యాగాలు మరువలేనివని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారీ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్బంగా భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)అబ్దుల్లాపూర్ మెట్ మండల సమితి ఆధ్వర్యంలో మండల కార్యదర్శి అజ్మీరా హరిసింగ్ నాయక్ అధ్యక్షతన రావి నారాయణ రెడ్డి కాలనీ ఫెజ్ 3 భూ పోరాట కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన బహిరంగ సభకి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి ముఖ్య అతిధిలుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతు…
బ్రాహ్మనియా అధిపత్య భావజాలం, మణుధర్మ శాస్త్రం పెద్ద ఎత్తున అమలైతున్న కాలంలో చదువుకుంటే చంపేసి రోజుల్లో కనీసం తినటానికి సరైన తిండి లేని కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ ప్రపంచంలోనే ఎవరు చదవని చదువు కేవలం అంబేద్కర్ మాత్రమే చదివి ప్రపంచానికె ఆదర్శంగా నిలిచాడని అన్నారు. కులం పేరుతో అణగారిన వర్గాలని ఊరికి దూరంగా,గుడికి,బడికి రానివ్వని సంస్కృతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసిన అంబేద్కర్ చదువుల కొరకు కుటుంబానికి దూరమై కనీసం తన పిల్లల చావులని సైతం కంట చూడలేని ఒక దినస్థితి ఆనాడు ఉన్నదని అన్నారు.

మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న ఈ రోజుల్లో,భారత దేశానికి దేశ అణగారిన ప్రజలకి, పిడిత ప్రజలకి రాజ్యాంగమే రక్షణ కవచం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రంగరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు సామిడి శేఖర్ రెడ్డి, పబ్బతి లక్ష్మణ్,అబ్దుల్లాపూర్ మెట్ మండల సహాయ కార్యదర్శి కేతారాజు నర్సింహా, ,బిఓసి జిల్లా కార్యదర్శి దాసరి ప్రసాద్, సిపిఐ పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
