HomeతెలంగాణHigh Court | చట్టానికి అందరూ సమానమే..

High Court | చట్టానికి అందరూ సమానమే..

సంచలన తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావుకు నాన్-బెయిలబుల్ వారెంట్.. అదాలత్ కేసులో కోర్టు ధిక్కారంపై ఆగ్రహం.. కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని స్పెషల్ సీఎస్.. రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో సంచలనం..

సామాన్యులు తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం స్థానిక నాయకులను ఆశ్రయిస్తారు.. వారితో సమస్యలు పరిష్కారం కాకపోతే ఆ పైస్థాయి లీడర్లను ఆశ్రయిస్తారు.. అక్కడా న్యాయం జరక్కపోతే అధికారులను ఆశ్రయిస్తారు.. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులకు మొరపెట్టుకుంటారు.. అక్కడకూడా పరిష్కారం లభించకపోతే న్యాయస్థానం మెట్లెక్కుతారు.. న్యాయస్థానం సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేస్తుంది.. కానీ నిబద్దత కలిగిన అధికారులు న్యాయస్థానం ఆదేశాలను కూడా ఖాతరు చెయ్యకపోతే ఇక సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుంది..

- Advertisement -

సమస్య పరిష్కారం ఎలా సాధ్యం అవుతుంది..? మరీ ముఖ్యంగా బ్యూరోక్రాట్స్ గా పిలువబడే ఐఏఎస్ అధికారులు సైతం కోర్టును ధిక్కరించడం బాధాకరం.. సామాన్యుడి సమస్యలను పరిష్కరించడానికి అసామాన్య మేధస్సును పుణికి పుచ్చుకున్న ఐఏఎస్ అధికారులు విధులను పక్కనబెడితే ఇక పరిపాలన ఎలా సాగుతుంది..? న్యాయం అందాల్సిన సామాన్యుడు ఎవరికీ మొరపెట్టుకోవాలి..? బాధ్యత కలిగిన బ్యూరోక్రాట్స్ రాజ్యాంగబద్దంగా వ్యవహరించినప్పుడే సమాజంలో న్యాయం పరిఢవిల్లవుతుంది.. తన బాధ్యతలు మరచిన ఒక ఐఏఎస్ అధికారికి అక్షింతలు వేసిన తెలంగాణ హైకోర్టు తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.

Telangana High Court Issues Non Bailable Warrant Against IAS Officer0

తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (తెలంగాణ హైకోర్టు) అత్యంత కీలకమైన, కఠినమైన నిర్ణయం తీసుకుంది. అదాలత్ ధిక్కార కేసులో (కంటెంప్ట్ కేస్. నెం : 2761 ఆఫ్ 2023) కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గాను, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఐఏఎస్ పై నాన్`బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ సంచలన ఉత్తర్వులు ఇచ్చారు.

అసలేం జరిగింది? : సూర్యాపేట జిల్లాకు చెందిన ఇద్దరు పార్ట్ టైమ్ స్వీపర్ల సర్వీసు క్రమబద్ధీకరణ విషయంలో గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఈ ధిక్కార కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా రామకృష్ణారావు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.

కోర్టు ఆగ్రహానికి కారణం ఇదే : హాజరు మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన దరఖాస్తును కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. అయినప్పటికీ, మరో దరఖాస్తు (ఐ.ఏ. నెం: 2 ఆఫ్ 2026) దాఖలు చేస్తూ, సచివాలయంలో కేబినెట్ సబ్`కమిటీ సమావేశం ఉన్నందున రాలేనని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు.

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమÖర్తి : “కోర్టు ఆదేశాల కంటే మీటింగ్ కే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కోర్టు పట్ల మీకు ఉన్న చులకన భావం అర్థమవుతోంది. ఇది వ్యవస్థను ధిక్కరించడమే.” అని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమÖర్తి..

హైకోర్టు ఆదేశాల ముఖ్యాంశాలు :

రామకృష్ణారావును అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని నాన్`బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.. ఈ వారెంట్‌ను వెంటనే అమలు చేసి, ఆయన్ని కోర్టు ముందు హాజరుపరిచేలా చూడాలని తెలంగాణ డీజీపీని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు చట్టానికి అతీతులు కారని, న్యాయస్థానాల పట్ల నిర్లక్ష్య వైఖరిని సహించేది లేదని కోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది. ఒక ఐఏఎస్ అధికారిపై, అది కూడా కీలకమైన ఆర్థిక శాఖ సెక్రటరీపై హైకోర్టు ఇంతటి కఠిన చర్యలు తీసుకోవడం రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

కాగా బ్యురోక్టాట్స్ గా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజల పక్షాన నిలబడాలని, బాధ్యతగా వ్యవహరించినప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించబడతాయని, న్యాయం కోసం ఒక సామాన్యుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు న్యాయస్థానం వారి తరఫున అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పుడు ఆ ఆదేశాలను పాటించకపోతే వారికి ఎలా న్యాయం జరుగుతుంది..? కనుక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పటికైనా తమ బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తించాలని, అప్పుడే ప్రజల్లో వారిమీద నమ్మకం పెరుగుతుందని, సమాజంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు గౌరవం పెరుగుతుందని, సొసైటీ సక్రమ మార్గంలో విరాజిల్లుతుందని ఆశిస్తూ, విజ్ఞప్తి చేశారు నేషనల్ ఓబీసీ సెక్రెటరీ సతీష్.

- Advertisement -
RELATED ARTICLES

Latest News