HomeతెలంగాణWeightlifting | జాతీయ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో తెలంగాణ పతకాల పంట..

Weightlifting | జాతీయ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో తెలంగాణ పతకాల పంట..

  • స్వర్ణాలతో మెరిసిన వెంకటేష్, అంజిరెడ్డి
  • కాంస్య పతకం సాధించిన పొనుగోటి దామోదర్ రావు

హర్యానా రాష్ట్రం భివాని జిల్లా లోహారు వేదికగా ఘనంగా జరిగిన ‘5వ జాతీయ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025–2026’ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. జాతీయ స్థాయి క్రీడాకారులతో హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో తమ అసాధారణ ప్రతిభను కనబరిచి, పతకాలు కైవసం చేసుకుని గర్వకారణంగా నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలలో 100 కేజీల విభాగంలో వెంకటేష్ గుణగంటి, 65 కేజీల విభాగంలో అంజిరెడ్డి గాదె స్వర్ణ పతకాలు సాధించగా 85 కేజీల విభాగంలో దామోదర్ రావు పోనుగోటి కాంస్య పతకం సాధించారు.

Telangana Athletes Shine At National Masters Weightlifting Championship01

ఈ సందర్భంగా పతక విజేతలు మాట్లాడుతూ.. “నిరంతర సాధన, అంకితభావం, వెయిట్‌లిఫ్టింగ్ పట్ల ఉన్న మక్కువే మమ్మల్ని ఈ స్థాయికి చేర్చాయని అన్నారు. స్నేహితులంతా కలిసి ఒకే జాతీయ వేదికపై పాల్గొనడం, పతకాలు సాధించి తిరిగి రావడం జీవితంలో మర్చిపోలేని మధురానుభూతని, ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత కఠినంగా శ్రమించి మరిన్ని గొప్ప శిఖరాలను అధిరోహిస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు. తమ ఈ క్రీడా ప్రయాణంలో అడుగడుగునా ప్రోత్సహిస్తూ, సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీరి విజయం పట్ల పలువురు హర్షం వ్యక్తంచేశారు.

Telangana Athletes Shine At National Masters Weightlifting Championship
- Advertisement -
RELATED ARTICLES

Latest News