- దెబ్బతింటున్న పంటలు..
- దిక్కు దోచని స్థితిలో రైతన్నలు..
తాడ్వాయి మండలంలో గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు , ఉదృతంగా ప్రవహిస్తున్నాయి, భారీ వర్షాలతో పంట చేన్లో నేను నిలిచి రైతుల వేసిన పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. వర్షాకాలం సీజన్ స్టార్టింగ్ లో ఎలినోవా ప్రభావంతో వర్షాలు నెల రోజులకు పైగా ముఖం చాటేసాయి. దీంతో రైతన్నలు పంటలు వేయడంలో ఆలస్యమయ్యాయి. తీరా ఇప్పుడు పంటలు వేసాక వానలు దంచి కొట్టడంతో వేసిన పంటలు కాస్త తొలి దశలోనే దెబ్బతింటున్నాయి. మండలంలో మొక్కజొన్న, సోయాబీన్, పత్తి పంటలు, కూరగాయ పంటలు విస్తారంగా సాగు చేస్తారు.
ఇప్పటికే సుమారు 400 నుండి 500 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. ఎక్కువగా వర్షాధార పంటలు వేసే రైతన్నలకు,అధిక వర్షపాతంతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడ్వాయి మండలంలోఇటీవల భారీగా కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్నాయి దీంతో పలు గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
మండలంలోని కాళోజివాడి గ్రామం లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగు భారీగా నిర్వహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగు పై వంతెన నిర్మించాలని పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకునే వారు లేరని ఆ గ్రామ సర్పంచ్ చంద్ర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని ఆయన కోరారు.
