HomeసినిమాSoggadu | సినీ ప్రముఖుల సమక్షంలో 19న 'సోగ్గాడు' స్వర్ణోత్సవం 

Soggadu | సినీ ప్రముఖుల సమక్షంలో 19న ‘సోగ్గాడు’ స్వర్ణోత్సవం 

నటభూషణ శోభన్ బాబు కథానాయకుడిగా, జయచిత్ర, జయసుధ కథానాయికలుగా  రూపొందిన ‘సోగ్గాడు’ చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుని, స్వర్ణోత్సవం జరుపుకోనుంది. కె.బాపయ్య దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డుల కలెక్షన్స్ ను వసూలుచేసింది. 1975 డిసెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం 2025 డిసెంబర్ 19 నాటికి సరిగ్గా 50 ఏళ్లను పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో  శ్రేయాస్ మీడియా సౌజన్యంతో భారీ ఎత్తున ఈ చిత్రం స్వర్ణోత్సవ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించబోతున్నారు.

Soggadu Film Golden Jubilee Celebration at Hyderabad 1

ఈ నెల 19న (శుక్రవారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, బంజారాహిల్స్, రోడ్ నెం 10లోని (బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో)  కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ స్వర్ణోత్సవాన్ని కన్నుల పండువగా జరపనున్నారు. ఈ ఈవెంట్ లో ప్రముఖ నటీమణులు జయచిత్ర, జయసుధ, రాధిక, సుమలత, ప్రభ, రోజారమణి తదితరులతో పాటు ప్రముఖ గాయని పి.సుశీల, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు, అట్లూరి పూర్ణచంద్రరావు, రాశీ మూవీస్ నరసింహారావు, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్ వంటి ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ 19న ‘సోగ్గాడు’ సినిమాను రీ రిలీజ్ చేయనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News