Homeఆదిలాబాద్Enumeration | ఎన్యుమరేషన్ ఫామ్ ల ఆన్ లైన్ వెంటనే పూర్తి చేయాలి

Enumeration | ఎన్యుమరేషన్ ఫామ్ ల ఆన్ లైన్ వెంటనే పూర్తి చేయాలి

  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఎన్యుమరేషన్ ఫాం ల డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం భైంసా పట్టణంలో ఎస్ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. పంపిణీ చేసిన ఎస్ఐఆర్ ఫాంలు, పూర్తి చేసిన ఆన్ లైన్ ప్రక్రియ, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియను మొత్తం పూర్తి పారదర్శకంగా పూర్తిచేయాలని ఆదేశించారు.

అనంతరం నిర్మల్ పట్టణంలోని 24 వ వార్డులో ఎస్ఐఆర్ తీరును పరిశీలించారు. ఆన్ లైన్ ప్రక్రియకు సంబంధించిన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. బిఎల్ఓ యాప్ ను పరిశీలించారు. స్థానిక ఓటర్లతో మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ఫారములు పూరించి, వెంటనే ఫారములు బిఎల్ఓ లకు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, తహసిల్దార్లు శశిభూషణ్, రాజు, ఎంపీడీవో నీరజ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News