- గ్రూప్-1 అధికారులతో నిర్వహణ..
అబ్దుల్లాపూర్ మెట్ మండలం, బండరావిరాల గ్రామంలో బుధవారం సర్పంచ్ కందికంటి విజయకుమార్ ఆహ్వానం మేరకు, నూతనంగా స్టేట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ గా నియమితులైన గ్రూప్-1 ఆఫీసర్స్ నేనావత్ కిరణ్ నాయక్, ఎస్. షణ్ముఖ శర్మ బండరావిరాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ప్రత్యేక ప్రేరణాత్మక సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించి, ఎన్నో ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, నిరంతర కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో చదివి నేడు స్టేట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ గా ఎంపికైన తమ జీవిత ప్రయాణాన్ని విద్యార్థులతో పంచుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థిలో అపారమైన ప్రతిభ ఉందని, సరైన దిశలో కృషి చేస్తే ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్-1, గ్రూప్-2 వంటి అత్యున్నత ఉద్యోగాలను కూడా సాధించవచ్చని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్, సీనియర్ అకౌంట్స్ అధికారి మాచర్ల శంకర్, గ్రామ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సింగు నర్సయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.
