- శిరీష రమేష్ గౌడ్..
వార్డు ప్రజలు ఆదరిస్తే 24 వ వార్డు అభివృద్ధికి పాటుపడి పని చేస్తానని నాయకులు శిరీష రమేష్ గౌడ్ అన్నారు. ఈ మేరకు 24 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వార్డు ప్రజలు, యువకులతో కలిసి గురువారం నామినేషన్ దాఖలు చేస్తూ వనపర్తి మున్సిపాలిటీ రిటర్నింగ్ అధికారి జమీల్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సాయి కృష్ణ కి బి శిరీష రమేష్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం బి శిరీష రమేష్ మాట్లాడుతూ.. వార్డు ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ, అభివృద్ధిలో పట్టణానికి ఆదర్శంగా 24 వ వార్డు ను తీర్చిదిద్దుతానని.. యువకులు వార్డు ప్రజలు తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తమను గెలిపిస్తే వార్డు ప్రజల అభీష్టం మేరకు పారదర్శకత పాలన లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. నరేష్ గౌడ్, భరత్ కుమార్, మహేందర్ గౌడ్, రామిరెడ్డి, రవీందర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, రాఘవేంద్రా రెడ్డి, రాములు యాదవ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు
