Homeమహబూబ్‌నగర్‌Pebbair | వైభవంగా గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ.

Pebbair | వైభవంగా గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ.

  • పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేనారెడ్డి, చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్..

పెబ్బేరు పట్టణ సమీపంలోని మిట్ట ఆంజనేయస్వామి ఆలయ పక్కన నూతనంగా నిర్మించిన గంగమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేనారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక శోభతో పునీతమైన పెబ్బేరు మున్సిపాలిటీలో మూడు రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Goddess Gangamma Temple Idol Consecration Ceremony In Pebbair

తెల్లవారుజాము నుంచే గణపతి హోమం, నవగ్రహ పూజలు, పూర్ణాహుతి వంటి క్రతువులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేనారెడ్డి మాట్లాడుతూ..గంగమ్మ తల్లి ఆశీస్సులు పెబ్బేరు ప్రజలందరిపై ఉండాలని, పాడిపంటలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

- Advertisement -
Goddess Gangamma Temple Idol Consecration Ceremony In Pebbair3 1

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, కౌన్సిలర్లు పర్వీన్ షకీల్, భాగ్యలక్ష్మి శివ, జంబులమ్మ, శివ సాయి, మార్కెట్ వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేసాగర్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ రామన్ గౌడు, బోయ సత్యనారాయణ, దయాకర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, రణధీర్ రెడ్డి, బ్రముని రాములు యాదవ్, డైరెక్టర్ రాములు వినయ్ కుమార్ ముదిరాజు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News