Homeమహబూబ్‌నగర్‌Niranjan Reddy | కౌంటింగ్ ప్రక్రియలో అభ్యర్థులు, ఏజంట్లు అప్రమత్తంగా ఉండాలి.

Niranjan Reddy | కౌంటింగ్ ప్రక్రియలో అభ్యర్థులు, ఏజంట్లు అప్రమత్తంగా ఉండాలి.

  • మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. 

నేడు జరిగే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలు అభ్యర్థులు ఏజెంట్లు ఆప్రమత్తంగా ఉండాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం మాజీ మంత్రి వనపర్తి, పెబ్బేరు బిఆర్ఎస్ అభ్యర్థులు మరియు మిత్రపక్షం సి.పి.ఏం అభ్యర్థులతో సమావేశమై జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన అంశాలను నియమ నిబంధనలు గూర్చి సవివరంగా వివరించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. చివరి ఓటు లెక్కింపు వరకు అభ్యర్థులు, ఏజంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికలలో హోరాహోరీగా పోరాడిన అభ్యర్థులకు, బిఆర్ఎస్ శ్రేణులకు, సమన్వయం చేసిన నాయకులకు ఆయన శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.
  

- Advertisement -
Candidates and Agents Advised on Municipal Election Counting

కౌంటింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించాలి.

  • జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్..

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ బృందం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ.. గత పంచాయతీ ఎన్నికలలో కొంతమంది ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాసి సోలీపూర్, సవాయి గూడెంలో ఫలితాలను తారుమారు చేశారని దీనిపై న్యాయం కావాలని న్యాయస్థానాలను ఆశ్రయించామని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రం సమర్పించిన వారిలో బోలెమోని లక్ష్మయ్య, గంధం. బాలపీరు, గంధం పరంజ్యోతి, గులాం ఖాదర్ ఖాన్, దేవర, వనపర్తి మండల్ సింగల్ విండో మాజీ అధ్యక్షులు సహదేవుడు, వనపర్తి మండల్  ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News