Friday, April 24, 2026
Homeవరంగల్‌Narsampet | అట్టుడికిన నర్సంపేట డివిజన్

Narsampet | అట్టుడికిన నర్సంపేట డివిజన్

శంకర్ గౌడ్ మృతదేహం వద్ద పలు పార్టీల రాసారోకోలు సందర్శించిన కేంద్రమంత్రి బండి సంజయ్ పలువురి అరెస్ట్ ఆగ్రహ జ్వాలల మధ్య కార్మికుల కోపద్రకాలు నర్సంపేట బస్టాండ్కు శంకర్ గౌడ్ మృతదేహాన్ని తరలించాలని భీష్మించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ టిఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నివారించిన పోలీసులు మండుటెండల్లో సైతం నినాదాలు చేస్తున్న కార్మిక వర్గం

నర్సంపేట బస్టాండ్ ఆవరణలో గురువారం మధ్యాహ్నం నర్సంపేట ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న కోలాశంకర్ గౌడ్ వంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోగా చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం కు ఆ హైదరాబాద్ కు తరలి వెళ్తున్న క్రమంలోనే అర్ధరాత్రి మృతి చెందాడు. దీంతో సొంత ఇల్లు లేకపోవడంతో తన అల్లుడు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తయ్య పేట గ్రామానికి మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్న క్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట ఆర్టీసీ డిపో కార్మిక రంగం విచ్చేసి నివాళులర్పించారు నివాళులు అర్పించారు.

- Advertisement -

అనంతరం వెంటనే శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వ రంగంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించడం క్రమంలో మొదటగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఆపై వరంగల్ జిల్లా రా బిజెపి ప్రధాన కార్యదర్శి రానా ప్రతాపరెడ్డిని రాష్ట్ర మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఏనుగుల రాకేష్ రెడ్డి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అరెస్టు చేసి పోలీసులు అక్కడి నుండి పంపించేశారు.

అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కాన్వాయ్ తో ముతోజిపేట గ్రామానికి విచ్చేసి శంకర్ గౌడ్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నర్సంపేట డిపో కార్మిక వర్గ కోరిక మేరకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట బస్టాండ్ కు తరలించి నివాళులర్పించిన అనంతరం దాన సంస్కారాలు ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులకు కేంద్రమంత్రికి తోపులాట జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News