Homeవరంగల్‌Election | ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక.

Election | ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక.

  • నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గా సారయ్య, వెంకట్.

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణ అభివృద్ధి సంస్థ (సెర్ప్-డిఆర్డిఏ) లో పనిచేస్తున్న వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు శుక్రవారం వరంగల్ డిఆర్డిఏ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా కాందారి సారయ్య, ప్రధాన కార్యదర్శిగా గుగులోతు వెంకన్న ఉపాధ్యక్షులుగా గోలి కొమురయ్య (పర్వతగిరి), గుండేటి కుమారస్వామి (సంగెం), శారద (దుగ్గొండి), కోశాధికారిగా వనమ్మ (నర్సంపేట) సహాయ కార్యదర్శులుగా రాజయ్య, సంపత్, యాకూబ్ కార్యవర్గ సభ్యులుగా మంజుల, బాబు, సుధాకర్, మోహన్ బాబు, సురేష్ గౌరవ అధ్యక్షులుగా మెట్టు దాసు (వరంగల్) సలహాదారులుగా అనిల్ (హెడ్ కోటర్) రమేష్ లీగల్ (దుగ్గొండి), అడ్వైజర్ గా కందిక సుధాకర్ (నల్లబెల్లి) లను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ తోపాటు, అధ్యక్షుడు సారయ్య ఉపాధ్యక్షుడు గోలి కొమురయ్య లు తెలిపారు.

SC ST Employees Welfare Association District Elections1

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జిల్లాలోని ఎస్టీ, ఎస్టీ ఉద్యోగులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి, వారి సమస్యలను పరిష్కరించడం కృషి చేస్తామన్నారు. మా మీద నమ్మకంతో మాకు జిల్లా బాధ్యతలను అప్పగించిన ప్రతి ఒక్క ఉద్యోగికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News