- ఎస్ఐ నర్సింలు
- ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
- రన్ ఫర్ యూనిటీలో పాల్గొన్న యువత
దేశ,సమైక్యత,సమగ్రతల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని మండల ఎస్ఐ నర్సింలు అన్నారు.జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం మండల కేంద్రంలో “రన్ ఫర్ యూనిటీ”నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ నర్సింలు మాట్లాడుతూ…సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఐక్యత దినోత్సవంగా నిర్వహించుకుంటామని,దేశానికి దిశ,నిర్దేశం చేసిన ఆయన చిరస్మరణీయుడని అన్నారు.అనంతరం”రన్ ఫర్ యూనిటీ”ప్రారంభించారు.దీనిలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు.అనంతరం దేశం కోసం మనం నిర్వర్తించాల్సిన బాధ్యతను తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,గ్రామస్తులు,యువకులు పాల్గొన్నారు..
