Friday, June 5, 2026
Homeఆదిలాబాద్Jammi Art | జమ్మి ఆకుల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్ర..

Jammi Art | జమ్మి ఆకుల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్ర..

సిఎం రేవంత్ రెడ్డి కొమురంభీం జిల్లాలో పర్యటించడంతో కృతజ్ఞతగా జమ్మి ఆకుల పై ఆయన రాజకీయ చరిత్ర ను రాసాను యువకుడు దుర్గం వినయ్ కుమార్.. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్(టి) మండలానికి చెందిన దుర్గం వినయ్ కుమార్ అనే యువకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 1న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా, వారికి కృతజ్ఞతాభావం తెలియజేస్తూ యువ రచయిత దుర్గం వినయ్ కుమార్ జమ్మి ఆకుల పై రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్ర రాసాడు.

తెలంగాణ రాష్ట్ర వృక్షమైన జమ్మి చెట్టు ఆకులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, ప్రజా సేవా కార్యక్రమాలు మరియు నాయకత్వ విశేషాలను లిఖించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ప్రత్యేక రచన స్థానిక ప్రజలు, విద్యార్థులు మరియు సాహిత్యాభిమానుల ప్రశంసలను అందుకుంది. తెలంగాణ చరిత్రను ఆకులపై లిఖించే ప్రత్యేక శైలితో ఆయన ఇప్పటికే గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లాకు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, తెలంగాణ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని అభినందించారు.

- Advertisement -

జమ్మి ఆకులపై రాజకీయ చరిత్రను లిఖించడం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు మరియు నాయకత్వ చరిత్రను కొత్త తరానికి చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వినయ్ కుమార్ తెలిపారు.

వినూత్న రచనలు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారి, పలువురి ప్రశంసలను అందుకుంటోంది.

  • గతంలో కూడ దుర్గం వినయ్ కుమార్ ఇలాంటి వి చాలానే రాసాడు.
  • నువ్వు గింజలపై జాతీయగీతం,తెలంగాణా రాష్ట్ర పుష్పం అయిన 20721 తంగేడు ఆకులపై తెలంగాణ చరిత్ర రాసాడు,
  • 6500 అగ్గి పుల్లలపై అంబేద్కర్ ఆశయాలు రాసాడు,
  • చింతాకులపై హనుమాన్ చాలిసాను రాసాడు,
  • సబ్బుబిల్ల పై తెలంగాణ చిత్రపటం వేసాడు,
  • చాక్ ఫీసులతో కళారూపాలు,
  • పెన్సిల్ ములికి పై తెలంగాణా అక్షరాలు,
  • నవధాన్యాలపై తెలంగాణా ప్రభుత్వ పథకాలు.,
  • బియ్యపు గింజలతో మహాత్మా గాంధి చిత్రం. చేసాడు.

*సూక్ష్మ కళ ద్వారా చరిత్ర, సాహిత్యం, సంస్కృతి, సామాజిక సందేశాలను ప్రజలకు చేరవేయడమే తన లక్ష్యమని వినయ్ కుమార్ తెలిపారు. ఆయన రూపొందిస్తున్న వినూత్న కళాఖండాలు స్థానికంగా విశేష ఆదరణ పొందుతూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఆయన మరిన్ని సృజనాత్మక కళాఖండాల రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు.

తనకు అవకాశం కల్పిస్తే తాను జమ్మి ఆకుల పై సిఎం రేవంత్ రెడ్డి చరిత్ర రాసిన ఫ్రేమ్ ను ఆయనకు అందిస్తానని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News