Homeఆదిలాబాద్"ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

“ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

రేపటి (మే 22) జిల్లా స్థాయి “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, గురువారం, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమ నిర్వహణపై, కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపటి రోజున కలెక్టరేట్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులు అందరినీ ఆహ్వానించాలని పేర్కొన్నారు. సరిపడిన సీటింగ్ ఏర్పాటు చేయాలని వివరించారు. కార్యక్రమానికి హాజరైన వారికి ఎప్పటికప్పుడు త్రాగునీరు అందిస్తూ ఉండాలని అన్నారు. 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను వివరిస్తూనే, రాబోయే రోజుల్లో చేయబోయే పనుల గురించి వివరాలను తెలియజేయాలని చెప్పారు. వివిధ పథకాలు జిల్లా ప్రజలకు పొందిన లబ్ది వివరాలను వివరించాలన్నారు.

- Advertisement -
Praja Palana Pragathi Pranalika Program Arrangements

అనంతరం రేపటి కార్యక్రమానికి సంబంధించి కలెక్టరేట్లో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, డిఆర్డిఓ విజయలక్ష్మి, సిపిఓ జీవరత్నం, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, విద్యాశాఖ అధికారి భోజన్న, పౌర సరఫరాల అధికారి రాజేందర్, డిడబ్ల్యుఓ వినూత్న, వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, మున్సిపల్ కమిషనర్ రవి బాబు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News