Homeవరంగల్‌పీఎం శ్రీ సాంఘిక సంక్షేమ గురుకులంలో వార్షికోత్సవ వేడుకలు.

పీఎం శ్రీ సాంఘిక సంక్షేమ గురుకులంలో వార్షికోత్సవ వేడుకలు.

  • ప్రిన్సిపల్ పి.అపర్ణ ఆధ్వర్యంలో

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని పీఎం శ్రీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ప్రిన్సిపల్ పి.అపర్ణ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్వతగిరి సర్పంచ్ చీదురు.శంకర్, మండల ఎంఈఓ ఏ.బిక్షపతి, ఎస్సై బి.ప్రవీణ్, పేరెంట్స్ కమిటీ పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపల్ అపర్ణ విద్యార్థులు ఈ వార్షిక సంవత్సరంలో సాధించిన ప్రగతిని (అన్యువల్ రిపోర్ట్) తెలియజేశారు.

PM Shri Social Welfare Gurukulam Anniversary1

అలాగే స్థానిక సర్పంచ్ చీదురు శంకర్ మాట్లాడుతూ విద్యా చాలా ముఖ్యమైందని అందులో పాఠశాల స్థాయి విద్య చాలా ప్రధానమైనదని, ఆ చోట నుండి స్టేజీపై కూర్చునే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అలాగే పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు.

- Advertisement -
PM Shri Social Welfare Gurukulam Anniversary2

ఎస్సై బి ప్రవీణ్ మాట్లాడుతూ ప్రస్తుత కల్చర్ అనుకున్న స్థాయిలో లేదని విద్యార్థినిలందరూ ఇంస్టాగ్రామ్ కు దూరం ఉండాలని, తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సూచనలు తూచా పాటించాలని తెలిపారు. కరాటే విన్యాసాలు ప్రదర్శించిన విద్యార్థులకు ₹1000 చొప్పున బహుమతిని ఎస్.ఐ బి ప్రవీణ్ అందించారు.

PM Shri Social Welfare Gurukulam Anniversary3

అనంతరం విద్యార్థులు యోగ, కరాటే విన్యాసాలు ప్రదర్శించారు. వివిధ సాంస్కృతిక నృత్యాలు, నాటకాలు ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు తయారు చేసినటువంటి వివిధ సాంకేతిక ప్రదర్శనలను, గణిత శాస్త్ర ప్రదర్శితలను వీక్షించడం జరిగింది. పీఎం శ్రీ బ్యాండ్ ప్రదర్శన, ప్రిన్సిపల్ ద్వారా వార్షిక నివేదిక సమర్పణ, ముఖ్య అతిథుల ప్రసంగం కలిసి ఈ కార్యక్రమానికి ప్రత్యేక వైభవాన్ని తీసుకువచ్చి, పాఠశాల సాధించిన విద్యా, సాంస్కృతిక, సమగ్ర అభివృద్ధిని స్పష్టంగా ప్రతిబింబించాయి. ఈ కార్యక్రమాల్లో పర్వతగిరి ఉప సర్పంచ్ చింతకుంట్ల అనిత, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News