Tuesday, May 26, 2026
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan | సంచలనం రేపుతున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..

Pawan Kalyan | సంచలనం రేపుతున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..

  • నదుల దుస్థితిపై తీవ్ర ఆవేదన..
  • పరిశ్రమల వ్యర్ధాలతో మురికిగా మారాయి..

రాజమండ్రిలో గోదావరి నది కాలుష్య పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నదుల ప్రస్తుత దుస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మన సంస్కృతిలో భాగమైన ‘మా తెలుగు తల్లి’ గేయంలో.. గోదావరి, కృష్ణమ్మల ‘గలగల’లు అని ఎంతో గర్వంగా పాడుకుంటాం. కానీ, నేడు పరిశ్రమల వ్యర్థాలతో నదులు మురికికూపాలుగా మారుతున్న తీరు చూస్తుంటే.. భవిష్యత్తులో గోదావరి, కృష్ణమ్మ ‘వెలవెల’ అని పాడుకోవాల్సిన దుస్థితి కనిపిస్తోంది” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయ, ఇటు సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

పరిశ్రమల నుంచి వెలువడుతున్న విష వ్యర్థాలు నేరుగా పవిత్ర గోదావరి నదిలో కలవడం పట్ల పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నదిలోని కలుషిత నీటి నమూనాలను (శాంపిల్స్) తక్షణమే సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదికలు చేతికి వచ్చిన వెంటనే పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిన ఫ్యాక్టరీలపై కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నదులను కలుషితం చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News